Header Banner

మద్యం ప్రియులకు బిగ్ షాక్! ఇకనుండి ధరలు ఇలా!

  Sun May 18, 2025 18:00        Others

తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ధరా ఘాతంతో ఇబ్బంది పడుతున్న మందుబాబులు, తాజాగా మరో మారు లిక్కర్ ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వడదెబ్బ కొట్టినట్టు షాక్ లో ఉన్నారు. ఇటీవల బీర్ల ధరలను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఇతర మద్యం ధరలను కూడా పెంచడానికి సిద్ధమైంది.

 

మద్యం ధరల పెంపు సర్క్యులర్
మార్కెట్ ధరల ఆధారంగా కొత్త రేట్లు అమలులోకి రానున్నాయని తెలుస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త ధరలు అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మద్యం ధరలను పెంచుతున్నట్టు ఇప్పటికే మద్యం షాపులకు ఎక్సైజ్ శాఖ అధికారులు సర్క్యులర్లు పంపినట్లు సమాచారం. ఆ సర్కులర్ ప్రకారం లిక్కర్ ధరలను పెంచి విక్రయించవలసి ఉంటుంది. ఈ మేరకు లిక్కర్ షాపులు సిద్ధం అవుతున్నాయి.

 

ఇది కూడా చదవండి: పెను విషాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి!

 


లిక్కర్ ధరల పెంపు ఇలా ఉండే అవకాశం
దీని ప్రకారం 180 మిల్లీ లీటర్లకు క్వార్టర్ బాటిల్ పైన పది రూపాయలు, హాఫ్ బాటిల్ పైన 20 రూపాయలు, ఫుల్ బాటిల్ పైన 40 రూపాయలు లిక్కర్ ధరలు పెంచుతున్నట్టు సమాచారం. అయితే మద్యం దుకాణాలకు జారీ చేసిన సర్కులర్ లో ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో బీరు ధరలను 15 శాతం పెంచింది ప్రభుత్వం.

 

అధికారిక ప్రకటన చెయ్యని ఎక్సైజ్ శాఖ
లిక్కర్ ధరలను కూడా పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 10 నుంచి 15 శాతం వరకు లిక్కర్ ధరలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఇక ఫైనల్ గా త్వరలోనే మద్యం ధరల షాక్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తుంది .అయితే ఇప్పటివరకు లిక్కర్ ధరలను పెంపు చేస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారికంగా ప్రకటన చేయలేదు.

 


ధరల పెంపుపై మందుబాబుల ఆందోళన
దీంతో మద్యం ప్రియులను లిక్కర్ ధరల పెంపు పైన ఆందోళన నెలకొంది. ఇటీవలే బీర్ల ధరలు పెంచారని, మళ్ళీ ఏం ధరల పెంపు అని మద్యం ప్రియులు వాపోతున్నారు. అయితే ధరలను పెంచినా మందు బాబులు మాత్రం లిక్కర్ కొనుగోలు చేసి తాగడంలో తగ్గేదే లేదు అన్నది మనందరికీ తెలిసిందే.

 

ఇది కూడా చదవండి: విశాఖ నుండి అక్కడికి డైరెక్ట్ వందే భారత్ స్లీపర్! రూట్లు ఏంటో చూడండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AlcoholPrices #LiquorHike #BigShock #BoozeNews #PriceUpdate #AlcoholTax